
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)
బోరబండ లో రోడ్ షోకు అనుమతి కోరలేదంటూ పోలీసులు చెప్పడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటికి సంబంధించిన కాపీని, అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన సర్క్యులర్ను బండి సంజయ్ మీడియాకు విడుదల చేశారు. తమాషా చేస్తున్నారా? అంటూ పోలీసులపై రెచ్చిపోయారు. రాష్ట్రంలో దారుస్సలాం పాలన నడుస్తోందా? అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా? అని మండిపడ్డారు. బోరబండలో బీజేపీ తడాఖా ఏంటో చూపిస్తాం.. బీజేపీ శ్రేణులారా.. బోరబండకు భారీగా తరలిరండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..