జూబ్లీహిల్స్ బై పోల్ సర్వేల్లో స్పష్టత లేదు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చరమాంకానికి చేరుతున్నా.. సర్వేల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంలో అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈ రోజు సోమాజిగూడ ప్రెసైక్లబ్లో ''మీట్ ది ప్రెస
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చరమాంకానికి చేరుతున్నా.. సర్వేల్లో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంలో అంశంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఈ రోజు సోమాజిగూడ ప్రెసైక్లబ్లో 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. ఇక ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. గ్రామ స్థాయిలో ఉండే అభివృద్ధి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో లేదని కామెంట్ చేశారు. ఓటర్లలో ఏ పార్టీకి ఓటు వేయాలో ఇంకా స్పష్టత లేదని.. అందుకు సర్వేల్లో కూడా ఆ విషయం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

కనీసం వీధి లైట్లకు సైతం జీహెచ్ఎంసీ లో డబ్బులు లేని పరిస్థితి ఉందని కిషన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని తెలిపారు. ఈనాడు జూబ్లీహిల్స్ వెనుకబాటుకు బీఆర్ఎస్ పార్టీ కూడా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande