
జయశంకర్ భూపాలపల్లి , 6 నవంబర్ (హి.స.)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డలో ఈ రోజు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. సుడిగాలులు బీభత్సం సృష్టించిన ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో టోర్నోడ రావడం తొలిసారి అన్నారు. గోదావరి నది నుండి సుడిగాలులు అతివేగంగా పంటపొలాలు మీదుగా అటవీప్రాంతంలోకి వీచాయని, సుమారు 30 నుండి 40 ఎకరాల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు