రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలి: కలెక్టర్ బీఎం సంతోష్
జోగులాంబ గద్వాల, 6 నవంబర్ (హి.స.) రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ను ఉపసంహరించుకోవడం జరిగిందని, ఈ నెల 6వ తేదీ నుండి యధావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల
కలెక్టర్ బీఎం సంతోష్


జోగులాంబ గద్వాల, 6 నవంబర్ (హి.స.)

రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ను ఉపసంహరించుకోవడం జరిగిందని, ఈ నెల 6వ తేదీ నుండి యధావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. అకాల వర్షాల వలన ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్కు సంబంధించిన ఏర్పాట్లు, రైతులకు సరైన ధర (ఎం ఎస్ పి) చెల్లింపు, కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల ఏర్పాటు, తూకం చెల్లింపు ప్రక్రియల పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande