
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.) కన్నడ మూవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేజీఎఫ్ మూవీ ఫేమ్ హరీశ్ రాయ్ ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతోన్న ఆయన ఇవాళ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేజీఎఫ్-1 మూవీలో ఆయన హీరో యశ్ పక్కన చాచా పాత్రలో కనిపించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు