
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.) జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సెంటిమెంట్ తో గెలవడం అనేది అన్ని సమయాల్లో జరగదని చెప్పారు. పీజేఆర్ చనిపోయినప్పుడు ఆయన భార్య వెళితే 3గంటల పాటు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. అప్పుడు సెంటిమెంట్ ఏమైందని ప్రశ్నించారు. సెంటిమెంట్ పనిచేస్తే కంటోన్మెంట్ లోనే బీఆర్ఎస్ గెలిచేదని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..