
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)
రాష్ట్రంలో డ్రగ్, గన్ కల్చర్ కు మూలం కేటీఆరే అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఓట్ల కోసం ఇచ్చిన వాగ్ధానాలు, లక్షలాది కోట్ల బాకీల సంగతి ఏంటని ప్రశ్నించారు. ఇవాళ జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ నిర్వహించిన తుమ్మల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ బాకీ కార్డు అంటూ కేటీఆర్ చేస్తున్న ప్రచారానికి ఈ సందర్భంగా తుమ్మల కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ వారిచ్చిన వాగ్ధానాలు అసలు నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బంది కరంగా ఉన్నా గడిచిన 20 నెలలుగా రేవంత్ రెడ్డి సంక్షేమం, అభివృద్ధిని కొనసాగిస్తున్నారని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..