మధ్యలో అడ్డురావొద్దు.. పక్కకు వెళ్లండి.. పోలీసులపై నారా లోకేష్‌ ఫైర్.. ఎందుకంటే..
టంగుటూరు, 6 నవంబర్ (హి.స.)తెలుగుదేశం కార్యకర్తలకు, తనకు మధ్య పోలీసులు అడ్డువచ్చారంటూ మంత్రి నారా లోకేష్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తుండటంతో వీరి మధ్యంలో చిక్కుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే
Nara Lokesh Angered by Police Obstruction of T


టంగుటూరు, 6 నవంబర్ (హి.స.)తెలుగుదేశం కార్యకర్తలకు, తనకు మధ్య పోలీసులు అడ్డువచ్చారంటూ మంత్రి నారా లోకేష్‌ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తుండటంతో వీరి మధ్యంలో చిక్కుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్‌ విజయ్‌కుమార్‌ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన లోకేష్‌ సింగరాయకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావులను దూరంగా ఉండాలంటూ హెచ్చరించారు.

ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని టోల్ ప్లాజా దగ్గర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు టిడిపి శ్రేణులు.. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాలెపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి లోకేష్ వెళుతుండగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్‌, ఇతర టిడీపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. కార్యకర్తలు తోసుకుంటుండగా వారిని పక్కకు నెట్టే ప్రయత్నం చేసిన సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావులపై మంత్రి లోకేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande