
వికారాబాద్, 6 నవంబర్ (హి.స.) తరచూ ప్రమాదాలు జరుగుతున్న
చేవెళ్ల రోడ్డు బాగు చేయాలని తాండూర్లో ప్రధాన రహదారిపై గురువారం స్థానికులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. కాగా
ధర్నా చేసిన 25 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించారని, అనుమతి లేకుండా ధర్నా చేశారని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తీరుపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోమవారం మీర్జగూడ వద్ద ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొని 19 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన స్థానికులపై కేసు నమోదు చేయడంపై రేవంత్ సర్కార్పై చేవెళ్ల ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు