తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ రోడ్ ఎక్కిన రైతులు
సూర్యాపేట, 6 నవంబర్ (హి.స.) వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, లేదంటే తమకు చావే శరణంమంటూ గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని కుంచమర్తి గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కారు. జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై అడివెంల క్రా
రైతుల ధర్నా


సూర్యాపేట, 6 నవంబర్ (హి.స.) వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని, లేదంటే తమకు చావే శరణంమంటూ గురువారం సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని కుంచమర్తి గ్రామానికి చెందిన రైతులు రోడ్డెక్కారు.

జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై అడివెంల క్రాస్ రోడ్డు వద్ద ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి గంటసేపు ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపులా భారీగా వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా కాంటాలు త్వరగా వేయకపోవడంతో ధాన్యం మొలకెత్తుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైస్ మిల్లులో క్వింటాకు 5 కిలోల ధాన్యాన్ని కోత విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande