నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్
నాగర్ కర్నూల్, 6 నవంబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనాటి రోజుల్లో బంగారం ధర లక
కార్డెన్ సెర్చ్


నాగర్ కర్నూల్, 6 నవంబర్ (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి

మండల పరిధిలోని వెలుగొండ గ్రామంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు పెద్ద ఎత్తున కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈనాటి రోజుల్లో బంగారం ధర లక్షల్లో పెరగడంతో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయని, అలాంటి వాటిని అరికడుతూ ప్రజలను అప్రమత్తం చేసేందుకు కమ్యూనిటీ మొబలైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రధానంగా లక్షలు వెచ్చించి గృహాలు ఏర్పాటు చేసుకునే ఇంటి యజమానులు వందల రూపాయలతో తాళాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉందని అలా కాకుండా ప్రస్తుతం మార్కెట్లోకి నూతనమైన సెంట్రల్ లాక్ అలారం లాంటి తాళాలు అందుబాటులో ఉన్నాయని వాటిని ఉపయోగించుకోవడం వల్ల తెలియని వ్యక్తులు లేదా వివిధ సందర్భాలలో ఇంటికి తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిన సందర్భంగా ఇంటి యజమానులను వెంటనే అప్రమత్తం చేస్తుందని తద్వారా నష్టాన్ని నివారించుకోవచ్చు అని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande