
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)
నిర్దేశించిన చారిత్రక కట్టడాల అనుమతి వద్ద మెట్రో నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. పాత బస్తీలో మెట్రో నిర్మాణంపై ఏపీడబ్ల్యూఎఫ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. మెట్రో నిర్మాణాల వల్ల చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయని, పురావస్తు శాఖ లేకుండా మెట్రో నిర్మాణాలు చేపడుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి పనులు చేపట్టొద్దన్న నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం లేకుండా మెట్రో నిర్మాణం కొనసాగుతోందని, పాతబస్తీ అభివృద్ధికి మెట్రో ఎంతో కీలకమని వాదన వినిపించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు