
హైదరాబాద్, 6 నవంబర్ (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు జరగబోయే కేబినెట్ సమావేశం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 12న మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లు సచివాలయం నుంచి ఇవాళ అధికారిక ప్రకటన వెలువడింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి ప్రకటించిన విషయం తెలిసిందే.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు