
అమరావతి, 6 నవంబర్ (హి.స.)నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
గురువారం (06-11-2025) : కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు.
బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రకాశం(జి) బి.చెర్లపల్లిలో 65.2మిమీ, శ్రీసత్యసాయి(జి) గండ్లపెంటలో 45మిమీ, నెల్లూరు(జి) రాపూర్ 40.5మిమీ, విజయవాడ తూర్పులో 39మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.
ఇక తెలంగాణలో గురువారం పూర్తిగా పొడి వాతావరణమే ఉంటుందని.. భారత వాతావరణ విభాగం, హైదరాబాద్ వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV