
న్యూఢిల్లీ, 6 నవంబర్ (హి.స.) టీమిండియా మహిళ జట్టు వరల్డ్ కప్
గెలిచిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో టీమిండియా మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
అలాగే భారీ నజరానా కూడా బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి నేపథ్యంలో టాటా కంపెనీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టాటా కంపెనీకి సంబంధించిన సియెర్రా ( Sierra) SUV కార్లను టీమిండియా ప్లేయర్లకు గిఫ్ట్ గా ఇవ్వనున్నారట. ఈ మేరకు టాటా మోటార్స్ ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియా మహిళా ప్లేయర్లకు ఇచ్చే ఈ కార్ల ధర రూ.15 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఈ SUV కారు ఎలక్ట్రిక్ మోడల్ అని చెబుతున్నారు. ఇందులో 69 kWh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ పెడితే 420 km మైలేజ్ ఇస్తుందట. కాగా ఇప్పటికే వరల్డ్ కప్ విజేతలకు రూ.51 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..