
న్యూఢిల్లీ, 6 నవంబర్ (హి.స.)
ఈ నెల 2న జరిగిన ఉమెన్స్ వరల్డ్ కప్
2025 ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళ జట్టు విజయం సాధించింది. దీంతో దశాబ్దాల నాటి కలను సాకారం చేస్తూ.. ఉమెన్స్ టీం ప్రపంచ ఛాంపియన్స్ గా నిలిచింది. ఈ విజయం తర్వాత ఐసీసీ మహిళా ప్రపంచ కప్ ఛాంపియన్గా భారత జట్టు ట్రోఫితో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో కలిశారు. ఈ సందర్భంగా భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ, మేడమ్, ఈ టోర్నమెంట్ మాకు చాలా ప్రత్యేకమైనది. ఈ జట్టు గురించి గొప్ప విషయం ఏమిటంటే, ఈ టోర్నమెంట్ భారతదేశంలో జరుగుతుందని తెలుసుకున్న క్షణం, ఏది ఏమైనా, మన దేశం కోసం ఈ ట్రోఫీని గెలుస్తామని మేము నిర్ణయించుకున్నాము. ఈ రోజు మా జీవితంలోని అతిపెద్ద క్షణాన్ని మీతో పంచుకోవడం నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. మరోసారి, మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ధన్యవాదాలు మేడమ్. ఈ ట్రోఫీని మీకు అందించడం గర్వంగా ఉంది.అని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు