
కడప, 6 నవంబర్ (హి.స.) ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఇవాళ కడపలోని అమీన్‌పీర్ దర్గా (Ameenpeer Darga)ను దర్శించుకున్నారు. అయితే, దర్గా ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి.
ప్రధాన ముజావర్ అరిదుల్లా హుసైనీ నివాసం నుంచి మొదటి రోజు గంధం ఊరేగింపును నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కడప జిల్లాలోని అమీన్‌పీర్ దర్గాకు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. సర్వమతాలకు అతీతంగా భక్తులు ఆ దర్గాకు వెళ్లి ఉర్సు మహోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి సెలబ్రిటీలతో పాటు చాలామంది రాజకీయ నాయకులు హాజరవుతుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV