
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-weight:bold;font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ నవంబర్ 06( హి.స.)పోలింగులో పాల్గొనేందుకు బిహార్ వలస ఓటర్లు పెద్దఎత్తున వెల్లువెత్తుతున్నారు. వీరు అధికార ఎన్డీయేకు జై కొడతారా, విపక్ష మహాగఠ్‌బంధన్‌ను ఆదరిస్తారా అనేదానిపై భిన్న అంచనాలున్నాయి. గత కొద్దిరోజులుగా దిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు భారీ రద్దీతో బిహార్‌కు చేరుకుంటున్నాయి. సాధారణంగా దీపావళి, ఛఠ్ పూజ సమయంలో ఇలాంటి రైళ్లు నడుపుతారు. ఈసారి బిహార్ ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్లేవారి కోసం నడుపుతున్నారు. ‘ఎన్నికలకు ముందు మహిళలకు రూ.10,000 చొప్పున ఇవ్వడం ద్వారా ప్రభుత్వం వారిని ప్రభావితం చేయడానికి ప్రయత్నించింది. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు లేకపోవడమే బిహార్‌లో ప్రధాన సమస్య. మా రాష్ట్రం పరిశ్రమలతో సందడిగా ఉండాలని, విద్యా వ్యవస్థ మెరుగుపడాలని కోరుకుంటున్నాం.
. సెలవు దొరకడం కష్టమైనా తంటాలుపడి బిహార్‌కు వచ్చానని, నీతీశే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని హరియాణాకు వలస వెళ్లిన మధుబని జిల్లా వాసి మహ్మద్ ఖుర్షీద్ చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ