తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం.. విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత
అమరావతి, 6 నవంబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ డెయిరీ (Vijaya Dairy) మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) ఇవాళ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తుది శ్వాస విడిచారు. అయితే, జానకిరా
eep-tragedy-in-telugu-states-former-chairman-of-vijaya-dairy-man


అమరావతి, 6 నవంబర్ (హి.స.) తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విజయ డెయిరీ (Vijaya Dairy) మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) ఇవాళ కన్నుమూశారు.

గత కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన తుది శ్వాస విడిచారు. అయితే, జానకిరామయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) చైర్మన్‌గా 27 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పని చేశారు.

పాల ఉత్పత్తిదారులకు మెరుగైన సేవలు సేవలందించడం, విజయ డెయిరీ విస్తరణకు చేసిన కృషి అసామాన్యం. పాడి పరిశ్రమకు గాను ఆయన చేసిన కృషికి డాక్టర్ కురియన్ అవార్డు లభించింది. మండవ జానకిరామయ్య మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande