సైన్యానికి కుల మతాలు లేవు.. రాహుల్‌గాంధీపై రక్షణ మంత్రి ఆగ్రహం
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{} ఢిల్లీ నవంబర్ 06( హి.స.) భారతదేశంలోని 10 శాతం మంది
Defense Minister Rajnath Singh


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ నవంబర్ 06( హి.స.)

భారతదేశంలోని 10 శాతం మంది సైన్యాన్ని నియంత్రిస్తున్నారు అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, అగ్రకులాలే సైన్యాన్ని నియంత్రిస్తున్నాయని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కేంద్ర రక్షణ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎంపీ సైన్యాన్ని విభజించడానికి ప్రయత్నిస్తు్న్నారని బుధవారం ఫైర్ అయ్యారు. సైన్యానికి కుల మతాలు లేవని చెప్పారు. రక్షణ దళాల్లో రిజర్వేషన్లను డిమాండ్ చేయడం ద్వారా రాహుల్ గాంధీ అరాచకాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్ని్స్తున్నాడని విమర్శించారు.

‘‘బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లకు మద్దతు ఇస్తుందని, మేము పేదలకు ఇచ్చాము. మన సైనికులకు ఒకే మతం ఉంది, అది సైనిక ధర్మం’’ అని అన్నారు. కులం, మతం ఆధారంగా రాజకీయాలు ఈ దేశానికి చాలా హానికరం అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా రాహుల్ గాంధీని విమర్శించారు. సంవత్సరాలుగా కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుందని, ఇప్పుడు సైన్యాన్ని కూడా ఇందులోకి లాగుతోందని, ఇది చాలా సిగ్గు చేటు అని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande