బీహార్‌లో ప్రజాస్వామ్య పండుగ..యువ ఓటర్లకు ప్రధాని మోడీ కీలక పిలుపు
ఢిల్లీ, 6 నవంబర్ (హి.స.) : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్
ప్రధాని మోడీ కీలక పిలుపు


ఢిల్లీ, 6 నవంబర్ (హి.స.) : బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ ఈ రోజు ఉదయం ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 1,314 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా, సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన 56 కేంద్రాల్లో మాత్రం సాయంత్రం 5 గంటలకే ఓటింగ్‌ ముగించనున్నారు.

ఈ నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ (X) వేదికగా ఓ ట్వీట్‌ చేస్తూ బీహార్ ప్రజలను ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. “బీహార్‌లో ప్రజాస్వామ్య పండుగకు మొదటి దశ నేడు ప్రారంభమైంది. ఈ దశలో ఉన్న ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేయాలి. ముఖ్యంగా మొదటిసారి ఓటు వేయబోతున్న యువతకు నా హృదయపూర్వక అభినందనలు. గుర్తుంచుకోండి — మొదట ఓటు వేయండి, ఆ తర్వాతే పలహారం తీసుకోండి,” అని మోదీ ఆకట్టుకునే పద్ధతిలో పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande