
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
జమ్మూ / ఢిల్లీ నవంబర్ 06( హి.స.)
కాశ్మీర్ పాఠశాలల్లో ‘‘వందేమాతరం’’ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, దీనిని అక్కడి ముస్లిం మతం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ముస్లిం మత సంస్థల సమాఖ్య అయిన ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU) ప్రభుత్వం నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘‘బలవంతపు ఆదేశాలు’’గా అభివర్ణించింది. జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని స్కూళ్లలో విద్యార్థులు, సిబ్బంది సంగీత-సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంఘాలు తప్పుపట్టాయి. ఇది అన్యాయమని, ఇస్లాంకు వ్యతిరేకం అని ఆరోపిస్తున్నాయి.
)
ముతాహిదా మజ్లిస్-ఎ-ఉలేమా (MMU)కు నాయకత్వం వహిస్తున్న కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ ఈ ఆర్డర్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ