స్వర్ణ పంచాయతీల డేటా సేకరణలో. తీవ్ర నిర్లక్ష్యం
అమరావతి, 7 నవంబర్ (హి.స.):స్వర్ణ పంచాయతీల డేటా సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన 26మంది పంచాయతీ కార్యదర్శులపై ఆ శాఖ కమిషనర్‌ వేటువేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ తీసుకురాగా, కొందరు పంచాయతీ కార్యదర్శుల నిర్వా
స్వర్ణ పంచాయతీల డేటా సేకరణలో. తీవ్ర నిర్లక్ష్యం


అమరావతి, 7 నవంబర్ (హి.స.):స్వర్ణ పంచాయతీల డేటా సేకరణలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన 26మంది పంచాయతీ కార్యదర్శులపై ఆ శాఖ కమిషనర్‌ వేటువేశారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్వర్ణ పంచాయతీ పోర్టల్‌ తీసుకురాగా, కొందరు పంచాయతీ కార్యదర్శుల నిర్వాకంతో ఈప్రక్రియలో తప్పిదాలు జరిగాయి. దాదాపు మూడు వేల పంచాయతీల పరిధిలో వీటిని గుర్తించారు. ఒక్కో పంచాయతీలో ఒకే ఫోన్‌ నంబర్‌ను వందల అసె్‌సమెంట్‌లకు లింక్‌ చేసినట్టు అధికారులు గుర్తించారు. దీంతో తీవ్రనిర్లక్ష్యం వహించిన పంచాయతీ కార్యదర్శులను...జిల్లాకు ఒకరి చొప్పున గుర్తించి వారందరిపైనా ప్రభుత్వం వేటు వేసింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande