
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. భారీగా డబ్బు నిల్వ ఉంచినట్టు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్కు సమాచారం అందటంతో ఇవాళ ఉదయం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపడుతోంది.
ఇంట్లో ప్రతి అంగుళం క్షుణ్ణంగా గాలిస్తున్నారు.అదేవిధంగా కూకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉన్న
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీందర్రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేపడుతున్నారు. దీంతో
రవీందర్రావు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని ప్రాంతంలో..
పోలీసులు దుర్మార్గంగా ఎలా తన ఇంట్లోకి వస్తారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ ఇద్దరు బీఆర్ఎస్ నేతల
ఇంట్లో సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు