సీఎం రేవంత్ రెడ్డికి వినూత్న రీతిలో బర్త్ డే గిఫ్ట్!
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీఎం 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సృజనాత్మకంగా ఒక బహుమతిని అందించారు. సాయి
సీఎం రేవంత్ బర్త్డే


హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) నవంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఒకరోజు ముందే ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీఎం 57వ జన్మదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ ఫిషరీష్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సృజనాత్మకంగా ఒక బహుమతిని అందించారు.

సాయికుమార్ సీఎం రేవంత్ రెడ్డికి 57 కిలోల సన్నబియ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన చిత్రపటాన్ని బర్త్ డే గిఫ్ట్ గా అందించారు. రేవంత్ రెడ్డి పేదల కోసం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకాన్ని గుర్తుచేసేలా ఈ కానుకను రూపొందించడం ఇప్పుడు విశేషంగా నిలిచింది. పేదలకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ఈ చిత్రపటాన్ని తయారు చేయించినట్లు మెట్టు సాయికుమార్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande