
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)రష్యాలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతంగా ముగిసింది. ఉఫా నగరంలో నది ఒడ్డున భారతీయ విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. ఈ మేరకు రష్యాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. విద్యార్థి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది.
అజిత్ సింగ్ చౌదరి(22) రాజస్థాన్లోని అల్వార్లోని లక్ష్మణ్ గఢ్ నివాసి. 2023లో ఎంబీబీఎస్ చదివేందుకు రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో చేరాడు. అక్టోబర్ 19న ఉఫా నగరంలో అదృశ్యమయ్యాడు. .
కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టగా 19 రోజుల తర్వాత ఉఫా నగరంలో నది ఒడ్డున అజిత్ సింగ్ చౌదరి మృతదేహం లభ్యమైది. అజిత్ సింగ్ చౌదరి చనిపోయినట్లుగా కుటుంబ సభ్యులకు భారత రాయబార కార్యాలయం తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు