
అమరావతి, 7 నవంబర్ (హి.స.)
ఈ నెల 14, 15 తేదీల్లో పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సు జరగనున్నందున నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అతిథులు వచ్చే మార్గాలన్నింటికి మరమ్మతులు చేయించి, డివైడర్లకు రంగులు వేస్తున్నారు. నగరంలోని పలు కూడళ్లలో ఆకట్టుకునే కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. ఆశీల్‌మెట్ట జంక్షన్ నుంచి సంపత్ వినాయకుడి ఆలయం, దత్త ఐలాండ్, సిరిపురం జంక్షన్ మీదుగా వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనా వరకూ ఉన్న ప్రధాన కూడళ్లలో ఈ కొత్త కళారూపాలను పెట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ