నవంబర్ 14న జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టించబోతుంది.. ప్రశాంత్ కిషోర్
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ 7 నవంబర్ (హి.స.) బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. నెలల తరబడి తాను చెబుతున్నదే నిజమైందని జన్ సురాజ్ పార్టీ అ
ప్రశాంత్ కిషోర్


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ 7 నవంబర్ (హి.స.)

బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. నెలల తరబడి తాను చెబుతున్నదే నిజమైందని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అన్నారు. శుక్రవారం ప్రశాంత్ కిషోర్ మీడియాతో మాట్లాడారు. బీహార్లో 60 శాతం కంటే ఎక్కువ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. ఇదే విషయాన్ని నెలల తరబడి తాను చెబుతూనే ఉన్నానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు జన్ సురాజ్ పార్టీ ఒక ఎంపిక అయిందని.. ఈ విషయంలో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. పోలింగ్ పెరగడానికి ఛత్ పండుగ కూడా కలిసొచ్చిందని తెలిపారు. నవంబర్ 14న జన్ సురాజ్ పార్టీ చరిత్ర సృష్టించబోతుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande