వ్యక్తిపై హత్యాయత్నం.. స్కార్పియో వాహనంతో ఢీ కొట్టి రాడ్లతో దాడి చేసిన దుండగులు
జోగులాంబ గద్వాల, 7 నవంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్ శివారులో ఒక వ్యక్తిని స్కార్పియో వాహనంతో ఢీ కొట్టి రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సంఘటన వెలుగులోకి రావడంతో సంచలనంగా మారి
హత్యాయత్నం


జోగులాంబ గద్వాల, 7 నవంబర్ (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం క్యాతూర్

శివారులో ఒక వ్యక్తిని స్కార్పియో వాహనంతో ఢీ కొట్టి రాడ్లతో దాడి చేసి హత్య చేసేందుకు యత్నించిన సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం సంఘటన వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఉండవెల్లి మండలం మారమునగాల గ్రామానికి చెందిన వెంకటేష్ గురువారం రోజున క్యాతూర్ బ్యాంకుకు వెళ్లాడు. బ్యాంకు పని ముగించుకుని ద్విచక్ర వాహనం పై తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా క్యాతూర్ సమీపంలోని చెరువు కట్ట దగ్గరకు రాగానే స్కార్పియో వాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వెంకటేష్ బైక్ను ఢీ కొట్టి రాళ్లతో దాడి చేశారు. స్పృహ కోల్పోయిన వెంకటేష్ మృతి చెందాడని అక్కడే వదిలేసి దుండగులు పరారయ్యారు.

రాత్రి పది గంటల ప్రాంతంలో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలైన వెంకటేష్ను కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande