రెండో రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణలు రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి విడతలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్, రెండో విడతలో మరో నలుగురిని విచారించేందుకు షెడ్య
ఫిరాయింపు ఎమ్మెల్యేలు


హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై జరుగుతున్న విచారణలు రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి విడతలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్, రెండో విడతలో మరో నలుగురిని విచారించేందుకు షెడ్యూల్ ఇచ్చారు. ఇందులో భాగంగా నిన్న (గురువారం) భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కేసులను స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారించారు. అలాగే ఈ రోజు పోచారం శ్రీనివాస్ రెడ్డి Vs జగదీశ్ రెడ్డి కేసు విచారణ జరగనుండగా, పిటిషన్ వేసిన జగదీశ్ రెడ్డిని పోచారం తరపు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. మధ్యాహ్నం అరికెపూడి గాంధీ Vs కల్వకుంట్ల సంజయ్ కేసు విచారణ జరుగనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande