
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)
అయ్యప్ప స్వామి భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలకు స్పెషల్ రైళ్లను ఎస్సీఆర్ ఏర్పాటు చేసింది. అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం, యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే 60 -శబరిమల స్పెషల్ ట్రైన్ సర్వీసులు' నడపనున్నట్లు తాజాగా తన ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించింది.
నవంబర్ 14 నుండి జనవరి 21 వరకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. టికెట్ రిజర్వేషన్లు నేడు (నవంబర్ 7) ఉదయం 8.00 గంటల నుంచి అందుబాటులోకి వస్తాయి. రైల్వే విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. మచిలీపట్నం కొల్లం, కొల్లం మచిలీపట్నం, నర్సాపూర్ - కొల్లం, చర్లపల్లి - కొల్లం వంటి మార్గాల్లో ఈ రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు గుంటూరు, నంద్యాల, కడప, రేణిగుంట, విజయవాడ, గూడూరు వంటి ప్రధాన స్టేషన్ల ద్వారా ప్రయాణిస్తాయి. యాత్రికులు శబరిమల యాత్రలకు సౌకర్యవంతంగా ప్రత్యేక రైళ్లను ఉపయోగించుకోవచ్చని SCR అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు