ప్రధాని మోడీని కలవడం మెమొరబుల్ మూమెంట్.. తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సంద
క్రికెటర్


హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచిన భారత జట్టు సభ్యురాలు, తెలుగు క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆమెకు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన అరుంధతి రెడ్డి.. . 'భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలవడం సంతోషాన్ని ఇచ్చింది. భవిష్యత్తులో మహిళా క్రికెటర్లకు మరింత ప్రాధాన్యత పెరుగుతుంది. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు' అని చెప్పారు.

'ప్రధాని మోడీని కలవడం మెమొరబుల్ మూమెంట్. ప్రధాని మోడీని కలిసినప్పుడు మా అమ్మకి మీరు హీరో, ఈ విషయం చెప్పడానికే నాకు నాలుగైదు సార్లు అమ్మ ఫోన్ చేసిందని చెప్పాను. నా హీరోని నువ్వు ఎప్పుడు కలుస్తున్నావు? అని అమ్మ పదేపదే అడిగిందని ప్రధానికి చెప్పాను. ప్రధాని కూడా సంతోషం వ్యక్తం చేశారు అని అంది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande