వికసిత భారత నిర్మాణానికి ప్రేరణగా వందేమాతరం: వెంకయ్యనాయుడు
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గీతం వెలువడి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్
వెంకయ్యనాయుడు


హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) భారత స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన వందేమాతరం గీతం వెలువడి నేటికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రతి భారతీయుడు ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

'స్వాతంత్ర్య పోరాట దిశగా నాడు భారత జాతిని జాగృతం చేసిన ఈ గీతం, నేడు వికసిత భారత నిర్మాణం దిశగా యువతను చోదకశక్తులుగా తయారు చేసే స్ఫూర్తిని నింపగలదనే నమ్మకం ఉంది. వందేమాతరం పాడుదాం.. వికసిత భారతాన్ని నిర్మిద్దాం' అని ఆయన శుక్రవారం ట్వీట్టర్ వేదికగా తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande