
అమరావతి, 7 నవంబర్ (హి.స.)నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం కింద శుక్రవారం కోనసీమ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాం పదండి .. .. ..
నైరుతి బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం కోనసీమ, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వర్షాలు పడే ప్రాంతాల్లో రైతులు, రైతు కూలీలు అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కింద నిలబడవద్దు. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లండి. ఉష్ణోగ్రతలు సుమారుగా 26°C నుంచి 32°C మధ్య ఉండవచ్చు. నైరుతి, ఆగ్నేయ దిశ నుంచి గాలులు వీచవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV