
వాషింగ్టన్ డి సి, 7 నవంబర్ (హి.స.) ప్రధాని నరేంద్ర మోడీ (PM Naredra Modi) తన ప్రియ మిత్రుడని.. త్వరలోనే ఇండియాకు వెళ్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇవాళ ఆయన వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బరువు తగ్గించే మందుల ధరలను తగ్గించడానికి సంబంధించి భారత్‌తో కొత్త ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. భారత్‌తో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ రష్యా (Russia) నుంచి చమురు కొనడం చాలా వరకు మానేశారని తెలిపారు. మోడీ తనకు ప్రియమైన మిత్రుడని.. తమ మధ్య కూడా చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. తాను భారత్‌కు రావాలని ఆయన కోరుకుంటున్నారని.. తప్పుకుండా వెళ్తానని వెల్లడించారు. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది భారత్ (India)లో పర్యటించాలని మీరు ప్లాన్ చేస్తున్నారా.. అని ఓ జర్నలిస్టు ప్రశ్నించగా.. ‘మే బీ యస్’ అంటూ సమాధానమిచ్చారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతోన్న వేళ భారత్ పర్యటనపై స్పందించడం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV