ఈనెల చివరి వారంలో ఢిల్లీలో భారీ ర్యాలీ: మీనాక్షి నటరాజన్
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ విమర్శించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితం లేదని ధ్వజమెత్తారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడి
మీనాక్షి


హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.)

స్వతంత్ర సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ విమర్శించారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో జనాభిప్రాయం ప్రకారం ఫలితం లేదని ధ్వజమెత్తారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మీనాక్షి నటరాజన్.. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ అనేక విషయాలు బయటపెట్టారని బీహార్లో కూడా ఓటు చోరీ జరుగుతోందని ఆరోపించారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ జరుగుతోందని ఈ ఎన్నికలు ముగిశాక లక్షలాది మంది ప్రజల వద్దకు వెళ్లి సంతకాల సేకరణ చేపడతామన్నారు. నవంబర్ ఆఖరి వారంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న లక్షలాది మందితో కలిసి ఢిల్లీలోని రామ్లా మైదానంలో ఖర్గే, రాహుల్ గాంధీ నేతృత్వంలో ర్యాలీ నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande