సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు.. ప్రధాని సహా ప్రముఖుల విషెస్
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సహా.. ప్రముఖ రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. రేవంత్ కు ఆ దేవుడు ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రధాని మోదీ
రేవంత్ రెడ్డి బర్త్ డే


హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ సహా.. ప్రముఖ రాజకీయ నేతలు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. రేవంత్ కు ఆ దేవుడు ఆరోగ్యం, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రేవంత్ కు బర్త్ డే విషెస్ చెబుతూ ఒక నోట్ విడుదల చేశారు.

ఆయన పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్, స్పీకర్ ఓం బిర్లా రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. కేంద్రమంత్రి బండిసంజయ్ సీఎం రేవంత్ కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande