
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.)
రామగుండం మున్సిపాలిటీ పరిధిలోని
గోదావరిఖనిలో దారిమైసమ్మ ఆలయాల కూల్చివేత రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. గోదావరిఖని నుంచి ఎన్టీపీసీ వరకు రోడ్డు వెంట ఉన్న 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు తొలగించారు.ఈ కూల్చివేతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు.
ఆయన ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. 46 దారి మైసమ్మ ఆలయాలను అధికారులు ఎలా కూల్చేస్తారని ప్రశ్నించారు. అయితే, రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను ఎందుకు వదిలేశారని ధ్వజమెత్తారు. హిందూ ఆలయాలంటే అంత చులకనా.. ఎంత ధైర్యమని కామెంట్ చేశారు. అధికారులకు 48 గంటల టైమ్ ఇస్తున్నానని కూల్చిన అన్ని దారి మైసమ్మ ఆలయాలను తిరిగి కట్టించాలని హెచ్చించారు. లేని పక్షంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులను కూడా కూల్చివేయాల్సిందేనని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు అవ్వగానే వచ్చేది గోదావరిఖనికేనని.. అధికారుల సంగతి తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. దారి మైసమ్మ ఆలయాలను కట్టించకపోతే.. తానే రోడ్డుకు అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయిస్తానని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..