
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.)
లౌకికవాద పునాదుల మీద కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర కేబినెట్ మొత్తం కట్టుబడి ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ క్రైస్తవ ప్రతినిధులు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం.. పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదగడం కోసం.. వారిని ముందుకు నడిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం తెలంగాణ సమాజ హితం కోసం ప్రజా ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని, ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..