
తెలంగాణ, 8 నవంబర్ (హి.స.)
ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ సీపీ వి.సి సజ్జనార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలవుతాయని సజ్జనార్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రజాశాంతి, భద్రత కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు చెప్పారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక్కచోట గుంపుగా ఉండొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్దేశించిన సమయాల్లో నియోజవర్గంలో పరిధిలోని లిక్కర్ షాపులు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలో ఎవ్వరూ బాణాసంచా పేల్చొద్దని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు