
జగిత్యాల, 8 నవంబర్ (హి.స.)
క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తెచ్చే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని గీతా విద్యాలయం మైదానంలో శనివారం తెలంగాణ మహిళల ఇంటర్ డిస్టిక్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం గారు మాట్లాడుతూ.. చదువుతో పాటు క్రీడలు, ఫైన్ ఆర్ట్స్ ముఖ్యమన్నారు. క్రీడలు ప్రోత్సహించడం ద్వారానే అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ తీసుకురావడం వల్ల విద్య, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ కల్పనతో క్రీడలకు ప్రోత్సాహం కలుగుతుందని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు