
అమలాపురం, 8 నవంబర్ (హి.స.)
,మొంథా తుఫాను సమయంలో జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసిందని అనంతరం జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. శనివారం నాడు డీఆర్‌సీ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా పునరావాస కేంద్రం నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క కుటుంబానికి 3000 రూపాయలు నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు ఇచ్చి పంపించామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో హెక్టారుకు 20వేల రూపాయల నష్టపరిహారం ఉండగా.. వైసీపీ ప్రభుత్వం రూ.17 వేలకు తగ్గించిందని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 25 వేల రూపాయలు చేశామని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ