పరిశ్రమలు ఎలా మూసేయాలో మాత్రమే ఆర్జేడీ తెలుసు.. ప్రధాని
సీతామర్హిలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మో
PM Modi in Bhagalpur


,సీతామర్హి,, 8 నవంబర్ (హి.స.)

బిహార్‌ విద్యార్థుల కోసం మేం కంప్యూటర్లు, ఫుట్‌బాల్‌, హాకీ స్టిక్‌లు అందిస్తున్నాం. కానీ ఆర్జేడీ ప్రజలకు తుపాకులు ఇవ్వడం గురించి మాట్లాడుతుంది. బిహార్‌ ప్రజలు తుపాకుల ప్రభుత్వాన్ని కోరుకోవడం లేదు. వారు ప్రతిపక్ష నాయకులకు నిద్ర లేని రాత్రులను ఇస్తున్నారు. రాష్ట్రంలోని పిల్లల కోసం ఆర్జేడీ ఏం చేయాలనుకుంటుందో వారి ఎన్నికల ప్రచారంలో స్పష్టంగా కన్పిస్తోంది. జంగిల్‌రాజ్‌ల పాటలు, నినాదాలు వినండి. మీరు షాక్‌ అవుతారు. వారి వేదికలపై అమాయక పిల్లలతో దోపిడీదారులుగా మారాలనుకుంటున్నామని చెప్పాలంటూ బలవంతం చేస్తున్నారు. బిహార్‌లో పిల్లలు డాక్టర్లు అవ్వాలా.. దోపిడీదారులు కావాలా?. మన పిల్లలను చెడ్డవారిగా మారాలని కోరుకునే వారిని మనం గెలిపిస్తామా’ అని మోదీ ప్రశ్నించారు.

ఆర్జేడీ, కాంగ్రెస్‌లకు ఇండస్ట్రీలో ఏ,బీ,సీ,డీలు కూడా తెలియవని మోదీ ఎద్దేవా చేశారు. పరిశ్రమలు ఎలా మూసేయాలో మాత్రమే వారికి తెలుసని విమర్శించారు. జంగిల్‌ రాజా 15 ఏళ్ల పాలనలో బిహార్‌లో ఓ పెద్ద ఆస్పత్రి గాని.. వైద్య కళాశాల కానీ ఏర్పాటుచేయలేదన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande