జాతీయ రహదారిపై పత్తి రైతుల ఆందోళన.. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం
ఆదిలాబాద్, 8 నవంబర్ (హి.స.) పత్తి కొనుగోలులో సీసీఐ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. క
రైతుల ఆందోళన


ఆదిలాబాద్, 8 నవంబర్ (హి.స.)

పత్తి కొనుగోలులో సీసీఐ అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్-నాగపూర్ జాతీయ రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.

కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలకు రూ.8,110 తో పత్తిని కొనుగోలు చేయాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తేమ ఎక్కువగా ఉందంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande