
షాద్నగర్, 8 నవంబర్ (హి.స.)
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం నిరుపేదల వెంటే ఉంటుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదినాన్ని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన .మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన రేవంత్ రెడ్డికి సామాన్య ప్రజల కష్టసుఖాలు తెలుసని అన్నారు. అందుకే అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు