నూతన సంస్కరణలకు వ్యతిరేకంగా పత్తి రైతుల ఆందోళన
సంగారెడ్డి, 8 నవంబర్ (హి.స.) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐకి రైతులు పత్తి విక్రయించడంలో తీసుకువచ్చిన సంస్కరణల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సింగూర్ చౌరస్తా వద్ద ఆందోల్ నియోజకవర్గ ప
పత్తి రైతులు


సంగారెడ్డి, 8 నవంబర్ (హి.స.)

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీసీఐకి

రైతులు పత్తి విక్రయించడంలో తీసుకువచ్చిన సంస్కరణల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సింగూర్ చౌరస్తా వద్ద ఆందోల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలకు చెందిన రైతులు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పత్తి విక్రయాలలో ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సంస్కరణల కారణంగా గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తిని సిసిఐ రైతుల వద్ద కొనుగోలు చేస్తుండగా నూతన విధానంలో కేవలం 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తుండడం తేమశాతం 16% నుండి 15 %కి తగ్గించడం, పత్తి విక్రయాలకు స్లాట్ బుకింగ్ లాంటి నూతన విధానాలతో రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానాలను వెంటనే రద్దు చేయాలని పాత విధానంలోనే రైతుల వద్ద నుండి నేరుగా పత్తిని సీసీఐ కొనుగోలు చేసే వెసులుబాటు రైతులకు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande