సీఎం రేవంత్ రెడ్డి పై జాగృతి కవిత ఫైర్
వరంగల్, 8 నవంబర్ (హి.స.) ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే వీధి రౌడీల ప్రవర్తించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాలేజ్ యాజమాన్యాల తాట, తోలు తీస్తారా? అని నిలదీశారు
జాగృతి కవిత


వరంగల్, 8 నవంబర్ (హి.స.)

ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తుంటే వీధి రౌడీల ప్రవర్తించారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కాలేజ్ యాజమాన్యాల తాట, తోలు తీస్తారా? అని నిలదీశారు. జనం బాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే కవిత హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమాషా చేస్తే తాట తీస్తా, తొక్కుతా అంటూ ప్రైవేట్ కళాశాలలకు రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వడం దారుణమని ఫైర్ అయ్యారు. ఎందుకోసం తోలు తీస్తారని నిలదీశారు. తెలంగాణ విద్యార్థుల కోసం నిలబడిన వాళ్లపైన మీ వీరంగమా? మాట తప్పింది మీరు. అందుకే వాళ్లు కాలేజ్లు బంద్ చేశారు వీధి రౌడీలు కూడా సిగ్గు పడేలా సీఎం మాట్లాడుతున్నారు.. అని కవిత విమర్శించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande