అర్ధరాత్రి జర్నలిస్ట్ ఇంటి పై దుండగుల దాడి
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్ట్ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ సర్వే నెంబర్ 630లో విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొందరు ఇండ్ల నిర్మాణం చేపట్
జర్నలిస్ట్


హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.)

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో

న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన జర్నలిస్ట్ ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ సర్వే నెంబర్ 630లో విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి కొందరు ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో శుక్రవారం అమీన్ పూర్ తహసీల్దార్ వెంకటేష్ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఆ సమయంలో జర్నలిస్ట్ విఠల్ న్యూస్ కవరేజ్ కి వెళ్ళారు. దీంతో తమ అక్రమ నిర్మాణాలకు అడ్డుపడుతున్నాడని భావించి శుక్రవారం అర్ధరాత్రి విఠల్ ఇంటి పై దుండగులు దాడి చేశారు. సుమారు 15 మందికి పైగా దుండగులు ఇంటిపై దాడి చేసి కిటికీ అద్దాలు పగులగొట్టి డోర్లను బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో అలర్టైన విఠల్ అమీన్ పూర్ సీ ఐ కి సమాచారం అందించగా ఇద్దరు కానిస్టేబుల్ లను ఘటన స్థలానికి పంపించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande