
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) పశువులను అక్రమ రవాణా చేస్తున్న
లారీని పట్టుకుని, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శుక్రవారం రాత్రి ఘట్కేసర్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎదులాబాద్ అండర్పాస్ వంతెన సమీపంలో ఘట్కేసర్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు.
అనుమానస్పదంగా వెళుతున్న అశోక్ లేలాండ్ లారీ (TS 15 UE 8156) ని ఆపి తనిఖీ చేయగా వాహనంలో 66 పశువులు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. లారీ డ్రైవర్ ను విచారించగా ఇస్తాకర్, గుల్షన్, హరిద్వార్, ఎండి. కలీమ్ అనేవారు వారి యజమాని అఫ్రోజ్ సూచనల మేరకు విజయవాడ పశువుల మార్కెట్లోని హనుమాన్ జంక్షన్ వద్ద మొత్తం 66 పశువులను కొనుగోలు చేసి, హైదరాబాద్ బహదూర్పురా కబేళాకు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. వెంటనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని, లారీని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..