
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.)
గుండె పోటుతో సీనియర్ జర్నలిస్ట్,
గిరి ప్రసాద్ కన్నుమూశారు. గిరి ప్రసాద్ స్వస్థలం కర్నూలు కాగా గత 25 సంవత్సరాలుగా ఆయన వివిధ పత్రికలు టీవీ చానల్స్ లో పటాన్ చెరు నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. గత నెలలో ఆయన మాతృ మూర్తి విశాలక్షమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. అదే బాధ నుంచి తేరుకోలేక కృంగి పోయి మానసిక వేదనకు గురై రాత్రి నిద్రలోనే గుండె పోటు రావడంతో ప్రాణాలు వదిలినట్లు తెలుస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..